- ఆసిఫాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలి
- కొమురం భీమ్ యువసేన డిమాండ్
కెరమెరి : ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా కలెక్టర్ ఈ ఏడాది కొమురం భీమ్ వర్ధంతి సభ జరిగే జోడేఘాట్‌కు హాజరుకావాలని కొమురం భీమ్ యువసేన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనక దేవ్‌రావు, కోవ దేవ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని హట్టి బేస్‌క్యాంపులో సేన నూతన కార్యావర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, భద్రత కారణాలతో కొన్నేళ్లుగా కెరమెరి మండలంలోని జోడేఘాట్‌లో ఏటా నిర్వహించే భీమ్ వర్ధంతికి హాజరుకావడం లేదని పేర్కొన్నారు. కానీ ఏది ఏమైనా అక్టోబర్ 7న జరిగే భీమ్ వర్ధంతికి పీవో, క లెక్టర్ తప్పక హాజరుకావాలని అన్నారు.
గిరిజన పోరాట యోధుడి వర్ధంతి సభ విషయంలో అధికారులు, నాయకులు సవతి ప్రేమ చూపిస్తున్నారని, దీనికి భద్రత సాకు చూపుతున్నారని ఆరోపించారు. అన్ని సౌకర్యాలున్న ఆసిఫాబాద్‌ను నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలని, దానికి కొమురం భీమ్ జిల్లాగా నామకరణం చేయాలని కోరారు. నాయకులు చందన్‌శావ్, కుసంబ్‌రావు, సోంజి, నారాయణ, రాజు, భరత్, భీంరావు, న్యానేశ్వర్, మోడీ, సాంగ్వి సర్పంచులు జలపతిరావు, లింబారావు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షుడు అనక దేవ్‌రావు, ప్రధాన కార్యదర్శి కోవ దేవ్‌రావు, ఉపాధ్యక్షులు ఆత్రం చందన్‌శావ్, పెందోర్ మోహన్‌రావు, సంయుక్త కార్యదర్శులు మడావి రాజు, ఆత్రం విశ్వనాథ్, ప్రచార కార్యదర్శి ఎ. వెంకటేశ్, కె.బండేరావు, కె.సాగర్, కె.హన్మంతు, కోశాధికారి పూసం భీంరావు, పెందోర్ ఆనంద్‌రావు, సలహాదారులు ఎ.తుకారాం, ఎ.కుసుంబ్‌రావు, కె.సోము, కె.తెలంగ్‌రావు.
భీమ్ వర్ధంతికి పీవో, కలెక్టర్ రావాలి
Published Mon, Sep 15 2014 11:56 PM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement