సినీ ఫక్కీలో దోపిడీలు బట్టబయలు | police detained Nalgonda robberie gang | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో దోపిడీలు బట్టబయలు

Published Wed, Mar 16 2016 6:41 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

police detained Nalgonda robberie gang

సినిమా స్టయిల్‌లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠాను నల్లగొండ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ విశ్వజీత్ దుగ్గల్తెలిపిన వివరాలివీ...రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యుల దొంగల ముఠా డీసీఎం వ్యానుతో విజయవా- హైదరాబాద్ రహదారిపై అనుమానం రాకుండా తిరుగుతుంటుంది. సరుకులతో వెళ్తున్న వాహనాలను వెంటాడుతుంది.

వీలు దొరకగానే తమ డీసీఎం నుంచి ఆ వాహనంలోకి కొందరు చేరుకుంటారు. అందులోని సరుకులు, ఇతర విలువైన వస్తువులను తమ డీసీఎంలోకి మార్చుకుని, ఉడాయించటం ఈ గ్యాంగ్ స్టయిల్. దీనిపై బాధితుల ఫిర్యాదు అందుకున్న సూర్యాపేట పోలీసులు రంగంలోకి దిగి బుధవారం వారిని గుర్తించి, పట్టుకునేందుకు యత్నించగా నలుగురు పారిపోయారు. వారి డీసీఎంను రూ.21లక్షల నగదుతోపాటు రూ.10 లక్షల విలువైన బూస్ట్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విశ్వజీత్ దుగ్గల్ విలేకరులకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement