యువతిని కాపాడిన పోలీస్‌.. | Police Saved a Women From Suciede Attempt In Mulugu | Sakshi
Sakshi News home page

యువతిని కాపాడిన పోలీస్‌..

Published Tue, Jun 18 2019 7:52 PM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

Police Saved a Women From Suciede Attempt In Mulugu - Sakshi

సాక్షి, ఏటూరునాగారం(ములుగు): ప్రజలకు భద్రత కల్పించడంతోపాటు వారిని  రక్షించాల్సిన బాధ్యత పోలీసులదే. పోలీసులు బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే వారిపై ప్రజలకు నమ్మకం ఉంటుంది. నీళ్లలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి.. కాపాడారు. నీళ్లలో మునిగిపోతున్న యువతిని వెలికితీసి.. ప్రాణాలు కాపాడి నిజమైన పోలీస్‌ అనిపించున్నాడు వాజేడు ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌. మండలంలోని తాళ్ళగడ్డ ప్రాంతానికి  చెందిన మహిళ పర్వతం మల్లేశ్వరీ.. ముల్లకట్ట బ్రిడ్జ్‌ పై నుంచి నీళ్లలోకి దూకి ఆత్మహత్య ప్రయత్రం చేసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన వాజేడు ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌తోపాటు అక్కడే ఉన్న ఓ వాహనదారుడు సకాలంలో స్పందించి ఆమెను కాపాడారు.  ఇటీవలే కరీంనగర్‌లోని  జమ్మికుంట పట్టణంలో ఎస్‌ఐ సృజన్‌ రెడ్డి సాహసోపేతంగా బావిలోకి దిగి ఇద్దరిని కాపాడిన విషయం తెలిసిందే. ఈ అపూరూప దృశ్యాన్ని మరవక ముందే మరో సంఘటన చోటు చేసుకోవడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement