
సాక్షి, వరంగల్ అర్బన్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం సిద్దార్థ నగర్‌లోని ఓ ఇంట్లో బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారంతో అమృతరావు అనే వ్యక్తి ఇంటిపై దాడి చేసి భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడిన డబ్బు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఈ సొమ్ము వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి టీజేసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన డాక్టర్ పగిడపాటి దేవయ్యకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అమృతరావు ఇంట్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబందించిన వివిధ గ్రామాల పేర్లతో చిట్టీలు లభ్యమవడం పోలీసుల అనుమానానికి బలం చేకూర్చింది.
Comments
Please login to add a commentAdd a comment