హైదరాబాద్: నగరంలో వాహనదారులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన అర్థరాత్రి బంజారా హిల్స్లో జరిగింది. పోలీసులు రాత్రి సమయంలో డ్రంకన్డ్రైవ్ నిర్వహించారు. వచ్చే పోయే వాహనాలను ఆపి ఆల్కహాల్ టెస్టింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఓ వాహనదారుడిని ఆపి ఆల్కహాల్ టెస్టింగ్ చేయాలని పోలీసులు సూచించారు. కానీ, వాహనదారుడు అందుకు నిరాకరించాడు. పోలీసులపై ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఇది కాస్తా గొడవకు దారితీసింది. గొడవ పడ్డవారితో సహా మరొకరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.