* క్వారీల కేటాయింపు, తవ్వకాలు, విక్రయాలపై కమిటీలు
* ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఇసుకను సులభంగా ప్రజలకు చేరవేసేందుకు కొత్త ఇసుక పాలసీని రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించిన విధివిధానాలను విడుదలచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక క్వారీల కేటాయింపు, తవ్వకాలు, విక్రయాలతోపాటు నియంత్రణకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను నియమించింది. రాష్ట్ర స్థాయి కమిటీలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ చైర్మన్‌గా, మైన్స్ అండ్ జియాలజీ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా 13 మంది సభ్యులు ఉంటారు. జిల్లాల స్థాయిలో ప్రభుత్వం ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌సీ)లను ఏర్పాటు చేయనుంది.
కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ వైస్ చైర్మన్‌గా, గనులు, భూగర్భ వనరులశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ మెంబర్ కన్వీనర్‌గా ఈ కమిటీల్లో ఉంటారు. ఐటీడీఏ పీవో, డీపీవో, గ్రౌండ్ వాటర్ డీడీ, ఇరిగేషన్ ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, టీఎస్‌ఎండీసీ ప్రతినిధి ఒకరు కూడా సభ్యులుగా ఉంటారు. మైనింగ్ విభాగం జిల్లా పరిధిలో ఇసుక క్వారీలను గుర్తించి ప్రతిపాదలను సిద్ధం చేస్తే జిల్లా స్థాయి కమిటీ రెవెన్యూ, మైనింగ్ విభాగాల అధ్వర్యంలో సంయుక్త పరిశీలన అనంతరం టీఎస్‌ఎండీసీకి అలాట్‌మెంట్ నోటీసు జారీ చేస్తుంది.
ఇసుక పాలసీ విధివిధానాలు విడుదల
Published Fri, Jan 9 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement
Advertisement