ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు.
హైదరాబాద్: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడానికి చొరవ తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్‌తో కలసి అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనకు రైతు ఆత్మాభిమానయాత్రగా పేరు పెట్టాలని సూచిం చారు. ఒక రైతు కుటుంబానికి రూ.లక్ష ఇచ్చేందుకు ముందుకు వచ్చేటట్లు కాంగ్రెస్ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన ప్రతినిధులను ఒప్పించాలని కోరారు. తన వంతుగా రూ.లక్ష విరాళంగా ప్రకటించారు. రైతులకు భరోసా, ఆత్మహత్యల నివారణపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని పొంగులేటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.