వారం రోజులుగా జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం
కోటాకు మించి 1.59మిలియన్ యూనిట్ల విద్యుత్ వాడకం
కోతలు విధించక తప్పదంటున్న అధికారులు
వ్యవసాయానికి అమలవుతున్న విద్యుత్ కోతలు
గృహావసరాలకు, వ్యవసాయానికి పెరిగిన విద్యుత్ వాడకం
నల్లగొండ : జిల్లా ప్రజలకు విద్యుత్ కష్టాలు మొదలుకానున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. జిల్లాకు కేటాయించిన కోటాకు మించి విద్యుత్ వాడకం జరుగుతోంది. ఇప్పటికే వ్యవసాయరంగానికి విద్యుత్ కోతలు అమలు చేస్తుండగా...అతి త్వరలో గృహావసరాలకు విద్యుత్ కోతలు విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చలి తీవ్రత తగ్గి..పగటి పూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో...గృహావసరాల విద్యుత్ వినియోగం పెరగడం ప్రారంభమైంది. వారం, పది రోజుల నుంచి జిల్లాలో విద్యుత్ వాడకం కేటాయించిన దానికంటే 1.59మిలియన్ యూనిట్లు పెరిగింది. దీనిని బట్టి మండల, పట్టణ కేంద్రాల్లో కోతల సమయం ఖరారు చేయకతప్పదని విద్యుత్ శాఖ పేర్కొంది.
గతేడాది ఇదే రోజుల్లో విద్యుత్ సరఫరాకు వినియోగానికి మధ్య వ్యత్యాసం భారీగానే ఉంది. గతేడాది ఇదే రోజుల్లో జిల్లాకు కేటాయించిన కోటా 15.54 మిలియన్ యూనిట్లుగా కాగా వినియోగం 18.37 యూ నిట్లు ఉంది. ఈ ఏడాది ప్రస్తుతం జిల్లాకు కేటాయించిన కోటా 17.62 మిలియన్ యూనిట్లు కాగా వినియోగం 18.42 మిలి యన్ యూనిట్లు ఉంది. గతేడాది కేటాయించిన కోటా, వినియోగానికి మద్య తేడాను అంచనా వేసి ఈ ఏడాది జిల్లాకు కేటాయించిన కోటాను 2.08 మిలియన్ యూనిట్లు పెంచారు. కానీ వినియోగం అ ంతకుమించి పెరగడంతో మళ్లీ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో విద్యుదుత్పాదన ఆశాజనంగానే ఉన్నా వాడకం పెరిగితే మాత్రం మున్ముందు కరెంట్ కష్టాలు భరించక తప్పదనిపిస్తోంది.
తగ్గిన పంటల సాగు...
గతేడాది వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటి పోవడంతోనే ఖరీఫ్‌లో పంటలు సాగు చే సిన రైతులు విద్యుత్ సమస్యలతో అల్లాడిపోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రబీ పంటల సాగు తగ్గించారు. ఈ వేసవిలో కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించింది. దీంతో రబీ పంటలు సాధారణ సాగు విస్తీర్ణం 1,87,234 హెక్టార్లు కాగా...సాగైన పంటల విస్తీర్ణం 1,41,642 హెక్టార్లు. అంటే 45,592 హెక్టార్ల మేర పంటల సాగు తగ్గింది. గతేడాది రబీ పంటల సాగుతో పోలిస్తే మాత్రం 82,900 హెక్టార్లు పంటల సాగు తగ్గింది. పంటల సాగు తగ్గినప్పటికి ఆయకట్టు ప్రాంతంలో వ్యవసాయ పనులు ఆలస్యం కావ డంతో విద్యుత్ వినియోగం అధికంగానే ఉంది. దీంతో వ్యవసాయరంగానికి కోతలు విధి స్తూ విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తోంది. రాత్రి 3 గంటలు, పగలు 3 గ ంటలు చొప్పున ఆరుగంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ‘ఏ’ గ్రూపు పరిధిలో రా త్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గ ంటల వరకు, ‘బి’ గ్రూపు పరిధిలో తెల్లవారజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు, మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ సరఫరా చేస్తు న్నారు.
కరెంటు కోతలు తప్పవా..?
Published Mon, Feb 16 2015 12:16 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement
Advertisement