బాల్కొండ: విద్యుత్ సరఫరా కోసం అధికారులు నిర్ణయించిన డి-గ్రూపుపై రైతులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రైతులను విద్యుత్తు కోతల కంటే అధికంగా డి-గ్రూపు కలవర పెడుతోంది. నెలరోజులుగా ట్రాన్స్‌కో అధికారులు సాగుకు నాలుగు గ్రూపులుగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు.
అంతకు ముందు మూడు గ్రూపులలో విద్యుత్‌ను స రఫరా చేసేవారు. ప్రస్తుతం నాలుగో గ్రూపుగా డి-గ్రూపు ద్వారా రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆ రుత డి పంటలకు నీరందించే రైతులు డి-గ్రూపుతో తీవ్ర కలవరానికి గురవుతున్నారు. రాత్రి పూట పంటకు ఎలా నీరందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడు గం టల విద్యుత్‌ను ఐదు గంటలకు కుదించారు. అందులోనూ ఇన్‌కమింగ్ పేరిట రెండు గంటల కోతలు విధిస్తున్నారు.
దీని భావమేమిలో?
విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని నాలుగో గ్రూపు ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ, పగలు ఏదో ఒకగ్రూపు ఖాళీగానే ఉంచుతున్నారు. లోడ్ తగ్గించడానికే అయితే, అధిక లోడ్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో రెండు గ్రూపులలో విద్యుత్ సరఫరా చేస్తే ఫలితం ఉంటుందని రైతులు అం టున్నారు. అలా కాకుండా నాలుగు గ్రూపులుగా విభజించి, మూడు గ్రూపుల ద్వారానే విద్యుత్ సరఫరా చేయడం వెనుక మర్మం ఏమిటో తెలియక వారు కలవరపడుతున్నారు.
ట్రాన్స్‌కో అధికారుల పూటకో నిర్ణయంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పంటలు ఎండి రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. అయినా, అధికారులలో ఎలాం టి మార్పులేదు. వరి సాగుచేసే ప్రాంతంలో రాత్రి కరెంట్ సరఫరా ఉంటే వరి పంటకు నీరందించవచ్చు. ఆరు తడిపంటలు పండించే ఆర్మూర్ సబ్ డివిజన్ లాంటి ప్రా ంతంలో డి-గ్రూపు వృథా అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుతడి పంటలకు రైతులు దగ్గరుండి నీటి సరఫరా చేపట్టాల్సి ఉంటుంది. దీంతో ప్రమాదా లకు గురయ్యే అవకాశం ఉందని వాపోతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
సాగుకు విద్యుత్ సరఫరా వేళలు
ప్రస్తుతం సాగుకు నాలుగు గ్రూపులలో అధికారులు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఎ- గ్రూపులో తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు, బి- గ్రూపులో ఉదయం తొమ్మిది గంటల నుంచి పగలు రెండు గంటల వరకు, సి-గ్రూపులో పగలు రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు, డి-గ్రూపులో రాత్రి పది గంటల నుంచి మరునాడు తెల్లవారుజామున మూడు గంటల వరకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఇక అనధికార కోతలకు లెక్కే లేదు.
‘డి-గ్రూపు’తో రైతు డీలా
Published Mon, Aug 25 2014 2:58 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement