న్యాయం చేస్తామని బాధితులకు కలెక్టర్ భరోసా
సాక్షి, వనపర్తి/వనపర్తి : ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి సామాన్యుల సమస్యలను పరిష్కరించలేకపోతుంది. ఫిర్యాదుదారులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే చిన్నంబావి మండలం అయ్యవారిపల్లికి చెందిన ఇద్దరు సోదరులు భూమి కబ్జా విషయంలో తమకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై ప్రజావాణికి వెంట విషం తెచ్చుకున్నారు.
మరుగుదొడ్డి బిల్లు రాలేదని..
పానగల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామానికి చెందిన ఎండీ సైదయ్య ఏడాది క్రితం మరుగుదొడ్డి నిర్మించుకున్నాడు. ఇందుకోసం సుమారు రూ.20వేలు ఖర్చ య్యాయి. ప్రభుత్వం రూ.12వేలు ఇస్తుందని చెప్పడంతో అధికారుల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. అధికారుల చుట్టూ సంవత్సర కాలంగా తిరిగి తిరిగి వేసారిపోయాడు. అక్కడ న్యాయం జరగకపోవడంతో ఐదుసార్లు ప్రజావాణికి వచ్చి కలెక్టర్‌కు ఫిర్యాదుచేశాడు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు.
ఫిర్యాదుల వెల్లువ
ప్రజావాణి సమస్యలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్ శ్వేతామహంతి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, ఇన్‌చార్జ్ జేసీ చంద్రయ్య ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిలో ఎక్కువగా భూమికి సంబంధించినవి ఉన్నట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారులు వెల్లడించారు. ఈ వారం 122 ఫిర్యాదులు అందినట్లు గ్రీవెన్స్‌సెల్ అధికారులు తెలిపారు. ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
భూమి కబ్జాచేశారు
20ఏళ్లుగా గ్రామంలోని ప్రభుత్వ భూమిని సాగుచేసుకుని జీవిస్తున్నాం. నా భర్త చనిపోవడంతో పిల్లల పోషణ, చదువుల కోసం వలస వెళ్లాల్సి వచ్చింది. మా భూమిని గ్రామంలోని కొందరు ఆక్రమించుకుని అమ్ముకున్నారు. మాకు దిక్కులేని మా కుటుంబాన్ని చూసి భూమి అమ్ముకున్నారు. ఆ భూమిపై మాకు హక్కు కల్పించాలి.
– చెన్నమ్మ, కేతపల్లి, పానగల్ మండలం
ప్రభుత్వ గుర్తింపు ఇవ్వండి
ఇదివరకు నందగోపాలకృష్ణ యాదవ సంఘంలో సభ్యులుగా ఉన్న మేము పరమేశ్వరి యాదవ సంఘం పేరుతో కొత్త సంఘం ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు మా సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలి.
– అప్పరాల గొర్రెల పెంపకందార్లు, కొత్తకోట మండలం
వాడుకలోకి తీసుకురావాలి
గ్రామంలో ఏడాదిన్నర క్రిత ం నిర్మించిన మూడు మినీవాటర్ ట్యాంకులను వాడుక లోకి తీసుకురావాలి. రూ. ల క్షల ప్రజాధనంతో నిర్మించిన ట్యాంకులు ప్రస్తుతం దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి. నివాసగృహాలకు తాగునీరు సరఫరా అయ్యే పైప్‌లైన్లకు ఈ ట్యాంకులను అనుసంధానం చేయలేదు. పలుమార్లు గ్రామకార్యద ర్శి, ప్రజాప్రతినిధులకు విషయం చెప్పినా పట్టి ంచుకోవడం లేదు.– మియాపూర్ గ్రామస్తులు,
చిన్నంబావి మండలం
Comments
Please login to add a commentAdd a comment