
19న రాష్ట్రపతి రాక
బొల్లారం: ఈ నెల 19న నిర్వహించనున్న తమ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారని ఎంసీఈఎంఈ ఇంజినీరింగ్ కళాశాలల లె ఫ్ట్‌నెంట్ జనరల్ గురుముఖ్‌సింగ్ వెల్లడించారు. 1946లో ప్రారంభమైన ఈ కళాశాల సాంకేతిక శిక్షణతో ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిందన్నారు. దీంతో కళాశాలకు ఐఎస్‌ఓ 9001 సర్టిఫికెట్‌తో పాటు పాటు ప్రధానమంత్రి అవార్డు లభించిందని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌తో పాటు ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు.