మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా.. | Qualifications For Municipal Elections Candidates | Sakshi
Sakshi News home page

ఇవి తెలుసుకోండి

Published Tue, Jan 7 2020 8:47 AM | Last Updated on Tue, Jan 7 2020 8:47 AM

Qualifications For Municipal Elections Candidates - Sakshi

సాక్షి, రామాయంపేట(మెదక్‌) : మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు చట్టాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా నామినేషన్‌వేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు సంబంధించి అర్హతలు, అనర్హతల వివరాలు.  .

అర్హతలు.. 
►  ఎన్నికల్లో పోటీ చేయదల్చుకున్నవారు మున్సిపాలిటీ పరిధిలోని ఏదో ఒక వార్డులో ఓటర్‌గా నమోదై ఉండాలి. 
► నామినేషన్‌ వేసేనాటికి 21 ఏళ్లకంటే తక్కువ ఉండరాదు. 
► మహిళలకు 50 శాతం సీట్లు కేటాయింపు జరిగింది. వారికి నిర్దేశించిన స్థానాల్లో పోటీకి మహిళలకు మాత్రమే అవకాశం. 
► నూతన పురపాలక చట్టంమేరకు ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నవారు కూడా పోటీచేయోచ్చు. 
► సదరు వార్డు ఏవర్గానికి రిజర్వ్‌ అయిందో తెలుసుకొని  ఆ వర్గం వారే పోటీ చేయాల్సి ఉంటుంది. 

అనర్హతలు.. 
► మున్సిపాలిటీలో పాతబకాయలు ఉండి, గడువు ముగిసినా బకాయలు చెల్లించకపోతే వారు పోటీకి అనర్హులు. 
► ఏదైనా కేసులో జైలుశిక్షకు గురైనవారు పోటీకి అనర్హులు. 
► గతంలో అనర్హతవేటు పడ్డవారు పోటీ చేయరాదు. 
► గతంలో పోటీచేసి ఎన్నికల ఖర్చు చూపకుండా అనర్హతకు గురైనవారు అనర్హులు.  
►  మతిస్థిమితం సరిగా లేనివారు పోటీ చేయరాదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement