'ఇది బీసీల వ్యతిరేక బడ్జెట్'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీల వ్యతిరేక బడ్జెట్ అని టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బడ్జెట్లో చేతి వృత్తులకు ఆశించిన కేటాయింపులు లేవన్నారు. కేసీఆర్ సర్కార్ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలలో ఎండగడతామన్నారు.
జనాభా దామాషా పద్దతిన బీసీ సంక్షేమానికి రూ. 10 వేల కోట్లు కేటాయించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమానికి నిధులు కేటాయించకపోతే వారు పన్నులు కట్టరని చెప్పారు. పార్టీలకు అతీతంగా బీసీలను ఏకం చేసి కేసీఆర్ ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.