
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు ఓ మోస్త రు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం 11:30 గంటలకు ‘టిట్లీ’తుపానుగా మారి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది మరింత తీవ్రమై తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేం ద్రం పేర్కొంది. తదుపరి వాయవ్య దిశగా ప్రయా ణించి గురువారం ఉదయానికి ఒడిశా దాన్ని ఆనుకు ని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లోని గోపాల్‌పూర్, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అనంతరం ఈశాన్య దిశగా ప్రయాణించి కోస్తా, ఒడిశా మీదుగా గాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్ ప్రాం తం వైపు ప్రయాణించి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.