ముంచెత్తిన జడివాన | Rainstorm wreaking | Sakshi
Sakshi News home page

ముంచెత్తిన జడివాన

Published Thu, May 14 2015 11:48 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Rainstorm wreaking

 జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురియడంతో జన జీవనం స్తంభించింది. వర్షాలకు పలు పంటలు దెబ్బతినగా.. ఈదురు గాలులకు పెద్ద పెద్ద చెట్లు నేలమట్టమయ్యాయి.. రేకులు ఎగిరిపోయాయి. మామిడి కాయలు నేలరాలాయి. సిద్దిపేట మార్కెట్ యార్డులో  రైతులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిచిపోయింది.
 
 న్యాల్‌కల్ : మండలంలోని రుక్మాపూర్, ముంగి, హద్నూర్, రాంతీర్థ్ తదితర గ్రామాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపోగా.. ఇళ్ల పైకప్పు లు ఎగిరిపోయాయి. చేతికొచ్చిన మామిడి కాయలు నెల పాల య్యాయి. గురువారం పెళ్లిళ్లు అధికంగా ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు పడ్డారు. రుక్మాపూర్‌లో అధిక శాతం ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రెండున్నర గంటల పాటు ఏకదాటిగా గాలితో కూడిన వర్షం రావడంతో వివాహాల కోసం వేసిన టెంట్లు నేలమట్టమయ్యాయి.

దీంతో వివాహానికి వచ్చిన ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. వర్షం కార ణంగా అల్లాదుర్గం-మెటల్‌కుంట రోడ్డుపై రుక్మాపూర్ నుంచి ముంగి గ్రామ శివారు వరకు చాలా వరకు చెట్లు నెలకొరిగాయి. మరికొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. చేతి కొచ్చిన మామిడి పంట దెబ్బతినంతో రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన ఫలితంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
 
 సిద్దిపేటలో ఏకధాటిగా వర్షం
  సిద్దిపేట అర్బన్ : పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం పట్టణాన్ని ముంచెత్తింది. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 8:30 వరకు కురిసిన వర్షం గాలి దుమారంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిది. పట్టణంలోని మార్కెట్ యార్డుకు ైరె తులు అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. 

అదేవిధంగా రైతు బజార్‌లో అమ్మకానికి ఉంచిన కూరగాయలు అకాల వర్షపు నీటిలో కొట్టుకు పోయాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న డెక్కన్ చైర్ ఎగ్జిబిషన్ వెలివేషన్ తాత్కాలిక కట్టడాలు నేలకొరిగాయి. ఎగ్జిబిషన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన భారీ జేయింట్ వీల్ గాలి దుమారానికి పక్కకు ఒరిగి పోయింది.
 
 జహీరాబాద్ : పట్టణంలో గురువారం సాయంత్రం సుమార గం ట పాటు ఏకధాటిగా వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయం అ య్యాయి. బ్లాక్‌రోడ్డు, ఎస్‌బీహె చ్ కాలనీ రోడ్లు, ఎంపీపీ కార్యాలయం వెళ్లే రోడ్లన్నీ వర్షం నీటితో నిండుకున్నాయి. హౌసిం గ్‌బోర్డు కాలనీలో వరద నీరు ముందుకు వెళ్లక పోవడంతో ఎక్కడికక్కడే స్తంభించింది. రైల్వే అండర్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తహహశీల్దార్ ఆర్‌అండ్‌బీ, సీడీసీ కార్యాలయా ల ముందు వర్షం నీరు నిల్వ ఉం డడంతో అటుగా వెళ్లే ప్రజలు ఇబ్బంది పడ్డారు.  వర్షం కారణంగా రంజోల్‌లో అరటి పంట కు స్వల్పంగా నష్టం వాటిల్లింది.

తడిచిన జొన్న పంట
 కంగ్టి మండలంలోని తుర్కవడ్‌గాం, దెగుల్‌వాడి, నాగుర్(కే), నాగుర్(బీ), భీంరా, చౌకన్‌పల్లి, కంగ్టి తదితర గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురి సింది. కాగా.. నెల రోజులుగా తరచుగా కురుస్తున్న వర్షాలతో జొన్న పంటలు తడుస్తుండడంతో గింజలు రంగు మారి నల్ల బడినట్లు రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే వరకు దిగుబడిపై అంచనా వేయలేమని వారు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement