
రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపడంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పాత్ర....
డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్
మహబూబ్‌నగర్ అర్బన్ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపడంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పాత్ర ఎంతో కీలకమని, ఆయన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. శనివారం డీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ వర్దంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా స్థానిక అశోక్‌టాకీస్ చౌరస్తాలోని రాజీవ్ విగ్రహానికి , డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్‌కే దక్కిందన్నారు. ఆయన కృషి ఫలితంగానే గ్రామీణాభివద్ది నిధులు నేరుగా మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అందుతున్నాయని వివరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సి.రాధాఅమర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, మీడియా సెల్ కన్వీనర్ పటేల్ వెంకటేశ్, నాయకులు శ్రీనివాసాచారి,రంగారావు, చంద్రకుమార్ గౌడ; అల్తాఫ్ హుసేన్,హనీఫ్,అమరేందర్ రాజు, లక్ష్మణ్ యాదవ్,విఠల్‌రెడ్డి,లింగం నాయక్,నాగరాజు, మజీద్ అలీ, సారంగి లక్ష్మీకాంత్, పీర్ మహ్మద్ సాదిఖ్, ఆలీ ఉన్నారు.