ఒకటి నుంచి రేషన్‌ బంద్‌ | Ration bandh from 1st | Sakshi
Sakshi News home page

ఒకటి నుంచి రేషన్‌ బంద్‌

Published Fri, Jul 28 2017 3:43 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

ఒకటి నుంచి రేషన్‌ బంద్‌ - Sakshi

ఒకటి నుంచి రేషన్‌ బంద్‌

ఆత్మహత్య చేసుకున్న రేషన్‌ డీలర్‌ మృతదేహంతో రాస్తారోకో
 
బోధన్‌ టౌన్‌ (బోధన్‌): రేషర్‌ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించక పోతే ఆగస్టు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు బంద్‌ చేస్తామని రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేశ్‌ బాబు స్పష్టం చేశారు. నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండల కేంద్రానికి చెందిన రేషన్‌ డీలర్‌ దత్తు అప్పుల బాధతో బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువారం పోస్టు మార్టం అనంతరం మృతదేహంతో రేషన్‌ డీలర్ల సంఘం ఆందోళన నిర్వహించింది. బోధన్‌లోని రైల్వే గేట్‌ వద్ద డీలర్లు రాస్తారోకో చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ అప్పులు తీర్చలేక  నల్లగొండకు చెందిన శ్రీనివాస్, రుద్రూర్‌కు చెందిన దత్తు, సిరిసిల్లకు చెందిన మరో రేషన్‌ డీలర్‌ ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement