హైదరాబాద్ : తెలంగాణలో భారీగా విద్యుత్ డిమాండ్ తగ్గింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు, ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవటమే ఇందుకు కారణం. కొద్దిరోజులుగా దాదాపు 150 మిలియన్ల దాకా చేరిన విద్యుత్ డిమాండ్ 128 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సప్లయ్ 121 మిలియన్ యూనిట్లు ఉంది. దాంతో విద్యుత్ లోటు 7 మిలియన్ యూనిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 41.8 మిలియన్ యూనిట్లు ఉండగా, ఉత్పత్తి అవుతున్న జల విద్యుత్ 3 మిలియన్ యూనిట్లుగా ఉంది.
కేంద్ర వాటా, కొనుగోలు కలిపి 48.8 మిలియన్ యూనిట్లకు చేరింది. మరోవైపు విద్యుత్ డిమాండ్ తగ్గడంతో.. తాత్కాలికంగా నాగార్జున సాగర్‌లో జల విద్యుదుత్పత్తిని ప్రభుత్వం నిలిపివేసినట్లు జెన్‌కో వర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం నిన్న పగలు ఉత్పత్తి నిలిపివేసిన అధికారులు... సాయంత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.
తెలంగాణలో భారీగా తగ్గిన విద్యుత్ డిమాండ్
Published Mon, Oct 27 2014 10:50 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement