విద్యావృక్షం | Regional Engineering College to warngal | Sakshi
Sakshi News home page

విద్యావృక్షం

Published Sun, Dec 7 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

విద్యావృక్షం

విద్యావృక్షం

 రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్‌ఈసీ)..
 
ఓరుగల్లును విద్యాహబ్‌గా మార్చిన విజ్ఞానగని.. ప్రతిభావంతులకు పుట్టినిల్లు.. ఎందరెందరినో ఉన్నతులుగా.. మహోన్నతులుగా తీర్చిదిద్దిన విద్యాశిఖరం. కాలక్రమంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)గా రూపాంతరం చెంది.. విద్యాకుసుమాలను అందిస్తున్న ప్రతిష్టాత్మక సాంకేతిక కేంద్రం..! తెలంగాణ ఘనతను నలుదిశలా ఇనుమడింప జేస్తూ.. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా ఆణిముత్యాలను తయూరు చేస్తున్న నిరంతర విద్యా పరిశ్రమ. నాటి విద్యార్థులే మేటి విద్యావృక్షాలు ప్రభుత్వ, పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాలతోపాటు రాజకీయూల్లో రాణించి జిల్లా కీర్తిని చాటుతున్నారు. ప్రజా సేవలో పాలుపంచుకుంటూ తాము చదివిన నిట్‌కు, నడయూడిన జిల్లాకు వన్నె తెస్తున్నారు. అలాంటి వారిలో కొందరిపై ఈ వారం ‘సండే స్పెషల్’..
 
నిట్ క్యాంపస్ : ఒకప్పటి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ.. ఇప్పటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా కుసుమాలను దేశానికి అందజేస్తూ చెరిగిపోని ముద్ర వేసుకుంటోంది. దేశంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నె హ్రూ వరంగల్ నగర పరిధిలోని కాజీపేటలో 1959 అక్టోబర్ 10న రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే నిట్... చదువుల తల్లిగా పేరు సంపాదించింది. అప్పటినుంచి ఏటేటా విద్యా కుసుమాలను తయూరుచేసి తన దైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో విద్యనభ్యసించిన పలువురు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచి వరంగల్ కీర్తిని చాటుతున్నారు.  ఎక్కువ మంది ఆర్‌ఈసీ విద్యార్థులు ప్రభుత్వ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లో స్థిరపడి నిట్ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు. దేశంలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ సర్వీస్‌లకు ఎంపికయ్యూరు. సివిల్స్ టాపర్ అయిన ముత్యాలరాజు (ఐఏఎస్),  పారిశ్రామిక రంగంలోకి వచ్చి ఆ తర్వాత రాజకీయ రంగానికి మళ్లిన నెల్లూర్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నంధ్యాల ఎంపీ ఎస్‌పీవై రెడ్డి నిట్ పూర్వ విద్యార్థులే. సివిల్ సర్వీసుల్లో ఉన్న వి.అనిల్‌కుమార్(ఐ0ఎస్), ఎన్‌వీ.సురేందర్‌బాబు (ఐపీఎస్), ఎం.మహేందర్‌రెడ్డి (ఐపీఎస్), తెన్నీటి క్రిష్ణ ప్రసాద్ (ఐపీఎస్) సైతం నిట్ పూర్వ విద్యార్థులే కావడం విశేషం. అంతేకాకుండా... కొందరు సామాజిక ఉద్యమాలపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు  కేశవరావు నిట్ పూర్వ విద్యార్థే, న్‌కౌంటర్‌లో చనిపోయిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ నిట్‌లో విద్యనభ్యసించినవాడే. నిట్ డెరైక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ టి. శ్రీనివాసరావు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో 1982లో బీటెక్ పూర్తి చేశారు. తాము చదువుకున్న బడిని మరిచిపోకుండా ఇప్పటికీ నిట్ అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
 
 నిట్ విద్యార్థులు లక్ష్యాన్ని చేధిస్తారు

చిన్నతనం నుంచే నిట్‌లో చదివే అవకాశం దొరకాలని టార్గెట్‌గా పెట్టుకుని  కష్టపడ్డా. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నా. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రతిభ కనబర్చి అవార్డులను అందుకున్నా. కరాటే అంటే నాకు అమితమైన ప్రేమ. నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగా. నిట్‌లో చదువుకున్న వారు  క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ... కొన్ని కారణాల మూలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే అయ్యూ.            - శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
 
పూర్వ విద్యార్థులకు అవార్డులు ఇస్తాం..

నిట్ పూర్వవిద్యార్థి కావడం నాకు గర్వకారణంగా ఉంది. నిట్ అభివృద్ధిలో పూర్వ విద్యార్దుల సహకారం ఎంతో ఉంది. ఆర్‌ఈసీ, నిట్‌లో చదువుకున్న విద్యార్థులకు డిసెంబర్ 26న అవార్డులు ఇవ్వనున్నాం. నిట్‌లో బోధన ప్రమాణాలు బాగానే ఉన్నప్పటికీ...  అంతర్జాతీయంగా పరిశోధన ప్రమాణాల పరంగా పోటీ ఎదురవుతోంది. అందుకే బోధన ప్రమాణాలతో పాటు పరిశోధన రంగంవైపు ఇంజనీరింగ్ విద్యార్థులు దృష్టి పెట్టేలా కృషి చేస్తున్నాం. పీహెచ్‌డీ చేసే ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
 - టి.శ్రీనివాసరావు, నిట్ డెరైక్టర్  
 
 1. పి. సుధాకర్,
సీఎండీ, ఈసీఐఎల్
2. చంగపల్లి వెంకట్,
సీఈవో, ఈఎంఆర్‌ఐ
3. మహేందర్‌రెడ్డి, ఐపీఎస్
4. సురేంద్రబాబు, డీజీ
5. కృష్ణ ప్రసాద్, డీజీ
6.ముత్యాల రాజు, సివిల్స్ టాపర్
7. అనిల్ కుమార్, ఐఏఎస్
8. రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ
9. ఎస్‌పీవై రెడ్డి, నంద్యాల ఎంపీ
10. సాంబశివరావు, కేంద్ర మాజీ మంత్రి
11. రామ్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి
12. శ్రీనివాసరావు, నిట్ డెరైక్టర్
13.  శంకర్ నాయక్, ఎమ్మెల్యే
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement