
కాన్పు కోసం వస్తే... బయటకు గెంటేశారు
కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భవతులపై అటు వైద్యులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది కర్కశంగా ప్రవర్తించారు.
కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గర్భవతులపై అటు వైద్యులు, ఇటు ఆసుపత్రి సిబ్బంది కర్కశంగా ప్రవర్తించారు. దాంతో గర్భవతులు నరకయాతన అనుభవించిన సంఘటన వరంగల్ జిల్లా జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాన్పు కోసం ముగ్గురు గర్భవతులు శనివారం జనగామ ఆసుపత్రికి వచ్చారు.
కాన్పు చేసేందుకు వారికి వైద్య సిబ్బంది మత్తు మందు ఇచ్చారు. ఇంతలో తమ డ్యూటీ టైం అయిపోయిందని వైద్య సిబ్బంది కాన్పు కోసం వచ్చిన గర్భవతులను ఆసుపత్రి నుంచి బయటకు పంపేశారు. దాంతో గర్భవతుల బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి బయట గర్భవతులు తీవ్ర ప్రసవవేదన పడుతున్నారు.