
ప్రైవేట్‌రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలి
ఎక్కడలేని కులాలు, మతాలు మన దేశంలోనే ఉన్నాయని, వాటిని అంతం చేసి కులరహిత సమాజం నిర్మించినప్పుడే....
► నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
► ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు
పాలమూరు : ఎక్కడలేని కులాలు, మతాలు మన దేశంలోనే ఉన్నాయని, వాటిని అంతం చేసి కులరహిత సమాజం నిర్మించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని విశ్రాంత ఐఏఎస్, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు అన్నారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో జరిగి న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర తొలిమహాసభ ప్రతినిధుల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్క్సిజంలో కులానికి స్థానం లేదని, వర్గానికే ప్రాముఖ్యత ఇస్తారనే ఆరోపణలున్నాయని, వాటిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు.
కులా న్ని, వర్గాన్ని కలిపితేనే కుల నిర్మూలన సాధ్యమవుతుందనే విషయాన్ని గుర్తిం చాలన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు లెసైన్స్‌లు, రామెటీరియల్, షేర్లు, రుణాలు తదితర వాటిని ప్రభుత్వం నుంచే పొందుతుండటంతో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఇంగ్లీష్ తెలిసిన వారికే వస్తున్నాయని, ప్రభుత్వం కెజీ టు పీజీని ఇప్పట్లో అమలు చేసే అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి పోరాటం చేయాలన్నారు.
కులవివక్ష నిర్మూలనకే దళిత్ శోషణ్ ముక్తి పంచ్
దేశంలో పాతుకపోయిన కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి అంతం చేయడానికే తొమ్మిది సంఘాలతో దళిత్ శోషణ్ ముక్తిమంచ్ ఏర్పాటు చేశామని పంచ్ జా తీయ నాయకులు వి.శ్రీనివాసరావు అ న్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉ న్నా దళితుల చట్టాలను కాగితాలకే పరిమితం చేశాయని విమర్శించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ వల్ల ఉపాధి అ వకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నా రు. మోదీ దళితోద్ధరణ పేరుతో అంబేద్కర్ పేరును ప్రచారంలో వాడుకుంటున్నారని, అంతర్గతంగా హిందుత్వ, మ నుధర్మ భావజాలం పెట్టుకొని నటిస్తున్నారని విమర్శించారు. మత విద్వేశాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునేందుకు కొన్ని మతతత్త్వ పార్టీలు కుట్ర పన్నుతున్నాయ ని తెలిపారు.
అనంతరం కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభధ్రం, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జాన్‌వెస్లీ, ఆహ్వాన సం ఘం అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్, డా క్టర్ మధుసూధన్‌రెడ్డి, అడ్వకేట్ వినోద్‌కుమార్ తదితరులు మాట్లాడారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కొండమడుగు నర్సింహ, స్కైలా బ్, కేవీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, ఎం.కురుమయ్య, సీఐటీ యూ నాయకులు జబ్బార్, గోపాల్, బాల్‌రెడ్డి, కురుమూర్తి పాల్గొన్నారు.