శాసించే స్థాయికి ఎదగాలి
- రెడ్డి మహాగర్జనలో నేతలు
- రెడ్డి వర్గానికి రెడ్డి నాయకులే శత్రువులుగా మారారు..
- రూ.వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: రేవంత్‌రెడ్డి
మేడ్చల్: రెడ్లు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసి డెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెళ్లిలోని సాకేత్ భూసత్వ వెంచర్‌లో ఆదివారం రాత్రి రెడ్డి జాతీయ ఐక్య వేదిక ఏర్పాటు చేసిన రెడ్డి మహాగర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘రెడ్లు పది మందికి అన్నం పెట్టేవారు. అలాంటి వర్గం ప్రభు త్వాల నిర్లక్ష్యానికి గురై నేడు ఆశించే స్థాయికి దిగజారింది. రెడ్డి వర్గానికి రెడ్డి నాయకులే శత్రువులుగా మారారు. రెడ్ల ఐక్యత కోసం సమావేశం ఏర్పాటు చేస్తే మెజారిటీ నాయ కులు రాకపోవడం దురదృష్టకరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్లకు గుర్తింపు లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మందకృష్ణ మాదిగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రెడ్లు ముందుకు కదిలితే పాలకులు ఎందుకు దిగిరారని ప్రశ్నించారు. రూ.వెయ్యి కోట్లతో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం స్పందించకపోతే ఆంధ్రలో కాపుల మాదిరి పోరాడి సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. నాటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విధిగా విడుదల చేయడం వల్ల అధికంగా విద్యాసంస్థలు నడిపే రెడ్డి వ్యా పారులు బాగుపడ్డారని, కాని నేటి ప్రభుత్వం విద్యాసంస్థలు రెడ్లవి అనే అక్కసుతో నిధులు విడుదల చేయడం లేదని విమర్శించారు.
అర్థం కాని ప్రశ్న..: డీకే అరుణ
కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, రెడ్ల సమావేశాలకు రెడ్డి నాయకులు రాక పోవ డం అర్థం కాని ప్రశ్నలా ఉందన్నారు. రెడ్డి మహాగర్జన ఎవరికీ వ్యతిరేకం కాదని, రెడ్లకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తడానికి నిర్వహించిందేనని అన్నారు. వైఎస్ హ యాంలో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి సామా జిక వర్గ విద్యార్థులు ఫీజు రియంబర్స్‌మెంట్ పొంది విద్యావంతులయ్యారని చెప్పారు.
జేసీ.. కూర్చో..!
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తన మార్కు ప్రసంగంతో సభికులను కాసేపు నవ్వించినా.. తర్వాత బోర్ కొట్టడంతో సభి కులు కూర్చో.. కూర్చో.. అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన అలిగి వేదిక దిగి పోతుండగా.. ఐక్యవేదిక నాయకులు బతి మాలగా కాసేపు కూర్చొని వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్‌లో రెడ్లులు సీఎం కాలేరని, వైఎస్ తన మిత్రుడు అంటూనే ఆయన ప్రవేశ పెట్టిన ఫీజు రియంబర్స్‌మెంట్ వల్ల పనికిమాలిన వారంతా ఇంజనీర్లు అయ్యారని అనడంతో సభికులు అసహనానికి గురయ్యారు. ప్రెస్ గ్యాలరీలో కొంతమంది వైఎస్ జగన్ అభిమానులు ‘జై జగన్’ అంటూ నినదించడంతో.. కస్సుబుస్సుమంటూ మైక్ ఇచ్చి వేదికపై ఉన్నవారితో గొడవపడుతూ కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి, ఐక్య వేదిక నాయకులు హరివర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, నందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.