బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌పై తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీహార్ వలస దొరబాబులు కేసీఆర్, కేటీఆర్ అని రేవంత్ వ్యాఖ్యలు చేశారు.
గుంటూరులో చదివిన కేటీఆర్‌కు తెలంగాణ స్థానికత రాదని ఆయన అన్నారు. తెలుగుదేశంలో పదవులు అనుభవించిన టీఆర్ఎస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావువి దిగజారుడు రాజకీయాలని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
బీజేపీ వల్లే పార్లమెంట్‌లో టి.బిల్లు పాసైందని, సకలజనుల సమ్మెలో కీలక పాత్ర వహించిన మెదక్ జిల్లావాసికి దేవీప్రసాద్‌కు టికెట్ ఎందుకివ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.