
పోలవరంతో తెలంగాణకు ప్రమాదం
పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపకుంటే తెలంగాణ పునర్ నిర్మాణానికి అర్థం ఉండదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక, తెలంగాణ పరిరక్షణ వేదికల ఆధ్వర్యంలో ‘పోలవరం భద్రాచలానికే కాదు
ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపకుంటే తెలంగాణ పునర్ నిర్మాణానికి అర్థం ఉండదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక, తెలంగాణ పరిరక్షణ వేదికల ఆధ్వర్యంలో ‘పోలవరం భద్రాచలానికే కాదు తెలంగాణకూ ప్రమాదమే’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ... ఆదివాసీల హక్కులను పాలకులు విస్మరిస్తున్నారని విమర్శించారు. వారి అస్తిత్వాన్ని కాపాడటానికి పోలవరం ప్రాజెక్ట్‌ను ఆపాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ శక్తులు ఆదివాసీల పక్షాన నిలబడి పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ విద్యార్థి రచయితల వేదిక నాయకులు మైపతి మాట్లాడుతూ... గ్రామసభ అనుమతి లేనప్పుడు ప్రాజెక్ట్‌ను ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవటానికి కనీస ప్రయత్నం చేయలేదన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్ కుమార్, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు ఆత్రం, విద్యావ ంతుల వేదిక నాయకులు శ్రీధర్‌దేశ్‌పాండే, గిరిజన సంఘం నాయకులు వీరయ్య పాల్గొన్నారు.