ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌లోని ఓపెన్‌కాస్టు ప్రాంతంలో బుధవారం సాయంత్రం భూమి పగుళ్లు తేలిన ఘటన కలకలం రేపింది.
రామకృష్ణాపూర్: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌లోని ఓపెన్‌కాస్టు ప్రాంతంలో బుధవారం సాయంత్రం భూమి పగుళ్లు తేలిన ఘట న కలకలం రేపింది. ఓపెన్‌కాస్టు క్వారీకి పది మీటర్ల దూరం నుం చి గోదావరిఖని-బెల్లంపల్లి రహదారి పొడవునా పగుళ్లు తేలడం కలవరపాటు కు గురిచేసింది. మొదటి సంవత్సరం పనులు పూర్తి కావొస్తున్న సమయంలోనే భూమి పగుళ్లు తేలడం.. క్వారీలోని స్లైడ్ ఫాలింగ్ (మట్టి కూలి పోతుండడం) అవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పగుళ్లు తేలిన నేపథ్యంలో ఇప్పుడున్న రహదారి దారి మళ్లించారు.