
సంఘటన స్థలంలో పడి ఉన్న బైక్‌లు
ములుగు రూరల్ : రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధి రాయినిగూడెంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయినిగూడెం గ్రామానికి చెందిన తవిటి ప్రవీన్ తన మిత్రుడు కోట శ్రీకాంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై కిరాణా షాపు వద్దకు బయల్దేరాడు. అలాగే ఇదే గ్రామంలో తమ బంధువుల ఇంట్లో జరుగుతున్న దశ దిన కర్మకు మండలంలోని పొట్లాపురం గ్రామానికి చెందిన చిడం రవీందర్, ఈక పూలమ్మ ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
గ్రామస్తులు 108 వాహనంకు సమాచారం అందించి ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు తవిటి ప్రవీన్, చిడం రవీందర్, ఈక పూలమ్మలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. కాగా మార్గ మధ్యలో తవిటి ప్రవీన్(22) మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు ములుగు ఆస్పత్రిలో మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment