'అంతర్జాతీయ ప్రమాణాలతో రహదార్ల నిర్మాణం'
హైదరాబాద్: రాష్ట్రంలో రహదార్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలంగాణ డిప్యూటీ సీఎం టి.రాజయ్య స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంపై డిప్యూటీ సీఎం రాజయ్య అధ్యక్షతను మంత్రి వర్గ ఉప సంఘం శనివారం హైదరాబాద్లో భేటీ అయింది. అనంతరం రాజయ్య మాట్లాడుతూ... వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అధికారులు కోరామని తెలిపారు.
ఈ అంశంపై మళ్లీ 7 వ తేదీ సాయంత్రం మంత్రి వర్గ ఉప సంఘం భేటీ అవుతుందని చెప్పారు. ఎలాంటి మెటీరియల్ వాడితే రహదారులు ఎక్కువ కాలం మన్నుతాయో అధ్యయం చేసి సీఎం కేసీఆర్కు నివేదిక అందజేస్తామని టి.రాజయ్య వెల్లడించారు.