
తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు హెల్త్ కార్డుల పంపిణీని ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉద్యోగులకు ప్రయోజనం దక్కేలా ఆరోగ్య కార్డులు ఇచ్చి సీఎం కేసీఆర్ తన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. ఇదేరీతిలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ప్రతిశాఖ ఉద్యోగులు 'మనశాఖ- మన ప్రణాళిక' పెట్టుకుని ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. ఆరోగ్య కార్డుల విషయంలో మాట నిలబెట్టుకున్నందుకు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘం నాయకుడు దేవిప్రసాద్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.