హైదరాబాద్: ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించిన విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించేలా పథకం రూపొందించినట్టు వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రుల్లో ఉద్యోగులకు వైద్య సేవలు అందించనుంది. 60 శాతం వైద్య సేవలు ప్రభుత్వాసుపత్రుల్లోనే అందిస్తామని నిబంధన విధించింది.
ఆరు నెలల తర్వాత హెల్త్ కార్డుల పథకాన్ని సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వం గుర్తించిన ఏ ఆసుపత్రిలోనైనా హెల్త్ కార్డు చూపించి పూర్తిస్థాయి వైద్య సేవలు పొందవచ్చు. సర్కారు గుర్తించిన 1,885 రోగాలకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్.. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చు.
హెల్త్ కార్డుల విధివిధానాలు విడుదల
Published Mon, Nov 3 2014 7:52 PM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement