హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫీల్‌గూడ క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 4.10 లక్షలను గుర్తించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.