
అమ్మవారి ఆలయంలో సచ్చిదానంద సరస్వతి
అలంపూర్ రూరల్: అష్టాదశక్తి పీఠాలలో అయిదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని సోమవారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి రావడంతో వారి దర్శనం కోసం ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి వచ్చారు.
పీఠాధిపతులు విడిది చేసిన గృహంలో వారిని దర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడి అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధర్మపురి పీఠాధిపతుల వారికి ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు.