
గుండెపోటుతో సాక్షి విలేకరి మృతి
నిర్మల్‌లో గుండెపోటుకు గురై సాక్షి దినపత్రిక విలేకరి రాజేంద్రప్రసాద్ మృతి చెందాడు.
నిర్మల్ : నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుకు గురై సాక్షి దినపత్రిక విలేకరి మృతి చెందాడు.
జిల్లాలోని కడెం విలేకరిగా పని చేస్తున్న రాజేంద్రప్రసాద్ ఆదివారం ఉదయం గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందాడు. రాజేంద్రప్రసాద్ మృతి పట్ల సాక్షి యాజమాన్యం, ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.