
రెండ్రోజులు ముందుగానే జీతాలు
తెలంగాణలోని 4 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సెప్టెంబర్ నెల వేతనాలు ఈ నెల 28వ తేదీనే అందనున్నాయి.
దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో టీ సర్కారు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 4 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. సెప్టెంబర్ నెల వేతనాలు ఈ నెల 28వ తేదీనే అందనున్నాయి. అక్టోబర్ 2న బతుకమ్మ, 3వ తేదీన దసరా పండుగలను పురస్కరించుకుని ముందుగానే జీతాలు చెల్లించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా 28న వేతనాలు చెల్లించేందుకు ఆర్థికశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే 28వ తేదీ ఆదివారం కావడం గమనార్హం. ఆర్థికశాఖ దీన్ని గుర్తించక 28వ తేదీని ఖరారు చేసినట్లు కనబడుతోంది. 28వ తేదీ ఆదివారం వచ్చిన నేపథ్యంలో మరో రోజు ముందుకు జరిపి 27న జీతాలు చెల్లించే అవకాశాలున్నాయి.