
సాక్షి, హైదరాబాద్: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డుకు చైర్మన్‌గా ఆ శాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్య కార్యదర్శి గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమిస్తారు. సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ కేడర్ అధికారి ఉంటారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్‌సహా ఇతర సిబ్బందినం తా బోర్డు ద్వారానే నియమిస్తారు.
రాష్ట్రంలో ఇతర ఉద్యోగాల భర్తీకి ఎలాగైతే టీఎస్‌పీఎస్సీ ఉందో, అలాగే మెడికల్ నియామకాలకు ఈ బోర్డు ఏర్పాటు చేశారు. డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేసేవారు. వైద్య ఆరోగ్య రంగం అత్యవసరమైన విభాగం కావడంతో వాటిల్లో పోస్టులు ఖాళీఅయితే ఆ మేరకు వైద్య ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పోస్టులను వెంటనే భర్తీ చేయకపోవడంతో వేలాది వైద్య సిబ్బంది పోస్టులు ఏళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. ఆర్థికశాఖ అనుమతి ఇవ్వకపోవడం, ఇచ్చినా నియామకాలు జరపడంలో తాత్సా రం వల్ల ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత వేధిస్తుంది. దీన్ని నివారించేందుకు తమిళనాడు తరహాలో బోర్డును ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఏడాది క్రితమే భావించింది. ఎట్టకేలకు ఇప్పుడు ఇది ఆచరణ రూపందాల్చింది.
ఎప్పటికప్పుడు భర్తీ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రా లు, ఏరియా ఆసుపత్రులు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు ఇకపై మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డే చూస్తుంది. రిటైర్‌మెంట్లు, ఖాళీలు ఏర్పడగానే వెంటనే ఆ సమాచారం బోర్డుకు చేరుతుంది. బోర్డు ఆ మేరకు వాటికి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అనంతరం బోర్డు ద్వారానే నేరు గా భర్తీ చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న 500 కేటగిరీల పోస్టులను బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. వేగంగా పోస్టుల భర్తీ చేసేందుకే బోర్డు ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరో గ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. బోర్డు కోసం వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏదైనా కార్యాలయాన్ని కేటాయిస్తారు. తనకు అవసరమైన సిబ్బందిని నియమించుకునే అధికారం చైర్మన్‌కు కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment