సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లోని ప్రతిభావంతులు, సమర్థులైన అధికారులతో తెలంగాణ అడ్మిని స్ట్రేటివ్ సర్వీస్ (టాస్) ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో శుక్రవారం అసో సియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కీలక అధికారుల కొరత నేపథ్యంలో టాస్ అవసరం ఎంతో ఉందన్నారు.
గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని గ్రూప్–1 అధికారుల్లో అనుభవం, సమర్థత కలిగిన అధికారులను జాయింట్ కలెక్టర్లుగా, డైరెక్టర్లుగా, ఎండీలుగా నియమించాలని కోరారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు కోసం అధ్యయన కమిటీ ఏర్పాటు.. నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అవగాహన సదస్సుల నిర్వహణ.. గ్రూప్–1 కేటగిరీల్లోని పోస్టులు అన్నింటికి సమాన వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. కొత్తగా వివిధ శాఖల్లో నియమితులైన గ్రూప్–1 అధికారులను సన్మానించారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి హన్మంతునాయక్, ఇతర నేతలు శశికిరణాచారి, అరవిందరెడ్డి, అలోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment