' తెలంగాణ ఏజీని తొలగించండి' | Shabbir Ali Demand for remove Telangana Advocate General | Sakshi
Sakshi News home page

' తెలంగాణ ఏజీని తొలగించండి'

Published Mon, Jun 30 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

' తెలంగాణ ఏజీని తొలగించండి'

' తెలంగాణ ఏజీని తొలగించండి'

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వోకేట్ జనరల్‌గా కొనసాగుతున్న కె.రామకృష్ణారెడ్డిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మాజీమంత్రి షబ్బీర్‌అలీ సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ల కేసు విషయంలో వ్యతిరేకంగా వాదించిన రామకృష్ణారెడ్డిని ఏజీగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.

అధికారంలోకి వస్తే 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని టీఆర్‌ఎస్ హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు 5 శాతం రిజర్వేషన్లనే వ్యతిరేకించిన రామకృష్ణారెడ్డి ఇప్పుడు 12 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తక్షణమే ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని కూడా తేల్చాలని అందులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement