నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నీటి కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎండుతున్న గొంతులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు, తండాలు, జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇందుకు కరెంటు కోత లు ఓ కారణం కాగా, నీటి వనరులు అడుగంటిపోవడం మరో కారణం. వేసవి వచ్చిందంటే ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. రోజువా రీ అవసరాల సంగతి అలా ఉంచితే, తాగేం దుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది.
పగలు, రాత్రి నీటి కోసం పోట్లాటలు తప్పడం లేదు. ఈ వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి అధికారులు రూ. 1.50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. జిల్లాలో 347 బోర్లకు ప్లషింగ్, డిఫెనింగ్ చేశామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారులు చెబుతున్న వివిధ మంచి నీటి పథకాలతో ప్రజలకు సరిపోయే నీరు అందడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 11 తాగునీ టి పథకాలు చేపట్టారు. వీటికి సుమారు రూ. 200 కోట్లను వెచ్చించారు. వీటి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం న్యాల్‌కల్‌లో చేపట్టిన మంచినీటి పథకం నేటికీ ప్రారంభం కాలేదు. అధికారులు ముందే స్పందించి ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు తలెత్తేవి కావు. రక్షిత నీరు అందని ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ప్రయోజనం కలగడం లేదు.
జిల్లాలో నీటికటకట
Published Tue, May 6 2014 1:41 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement