నీట మునిగి యువకుడి దుర్మరణం
ఆ ఇంట్లో సరిగ్గా వారం రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది.. ఇందు కోసం ఇల్లు ముస్తాబైంది. శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తి అయ్యాయి. బంధువులు, స్నేహితుల రాకతో ఆ ఇల్లు కళకళలాడుతోంది. అయితే పెళ్లికుమారుడికి వరుసకు చిన్నాన్న చనిపోవడంతో కర్మ స్నానానికి వెళ్లిన వరుడు చెరువులో మునిగి దుర్మరణం చెందాడు. ఈ సంఘటనతో మండలంలోని మాటిండ్ల గ్రామంలో విషాదం నెలకొంది.
- చిన్నకోడూరు
మండలంలోని మాటిండ్ల గ్రా మానికి చెందిన పెరుమాండ్ల ఎల్లయ్య, మహంకాళవ్వలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు బాబు (20) వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆస రాగా ఉంటున్నాడు. ఇదిలా ఉండ గా.. ఇదే గ్రామానికి చెందిన అమ్మాయి తో బాబుకు ఇటీవల నిశ్చితార్థమైంది. ఈ నెల 18న వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి శుభలేఖలు కూ డా బంధుమిత్రులకు పంచారు. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సాహం ఉరకలెత్తుతున్న క్రమంలో పది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన వరుడి చిన్నాన్న అనారోగ్యంతో మరణించాడు. బుధవారం పది రోజుల కర్మ సందర్భంగా కుటుంబ సభ్యులు గ్రామ చెరువు వద్దకు వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరిగా చెరువులో స్నానాలు చేసి ఇంటికి వెళ్లాల్సి ఉండగా స్నానానికి చెరువులో ఈత కొడుతున్న బాబు నీటి ప్రవాహ ఒత్తిడికి మునిగిపోయాడు. అయితే విషయానిన గమనించి న ఒడ్డున ఉన్న వారు బాబును రక్షించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
అయితే బాబు ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తూ నీట మునిగి మృతి చెందాడు. దీంతో మంగళవాయిద్యాలు మొగాల్సిన ఇంట్లో చావు భాజా మోగింది. బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. విషయం తెలుసుకున్న చిన్నకోడూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆనంద్‌గౌడ్ తెలిపారు.