
సాక్షి, హైదరాబాద్ : ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. బదిలీల దరఖాస్తు గడువును ప్రభుత్వం తాజాగా ఒక రోజు పొడిగించింది. దీంతో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. అలాగే బదిలీలకు సంబంధించిన ఆప్షన్ల ఎంపిక ఈ నెల 20 నుంచి 23 వరకు ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈ నెల 25న బదిలీల జాబితా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 26న బదిలీల ఉత్తర్వుల జారీతో కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment