సాక్షి, హైదరాబాద్: జీఎస్టీతో వినియోగదా రులకు ఎంతో మేలు జరుగుతుందని రెవెన్యూ (వాణిజ్య పన్నులు) శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయ సంఘం, వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సు కు సచివాలయ సంఘం అధ్యక్షుడు మాధవరం నరేందర్ రావు అధ్యక్షత వహించగా సోమేశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీతో పన్ను ఎగవేత తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగి ప్రజల సంక్షేమానికి మేలు జరుగుతుందని వివరించారు. జీఎస్టీపై ఉద్యో గులు అవగాహన పెంచుకుని ప్రజల్ని చైతన్య పరచాలని సూచించారు. పలువురు ఉద్యోగులు లేవనెత్తిన సందేహాలను ఆయన నివృత్తి చేశారు.
‘రాష్ట్రపతి’ ఓటు