త్వరలో పాలకుర్తి వస్తా.. | Soon come to PALAKURTHI | Sakshi
Sakshi News home page

త్వరలో పాలకుర్తి వస్తా..

Published Sun, Aug 23 2015 3:40 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

Soon come to PALAKURTHI

హన్మకొండ : పాలకుర్తి వస్తే టీడీపీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తన కారు అద్దాలు బద్దలు కొడుతారంటున్నారు.. త్వరలోనే పాలకుర్తికి వస్తున్నా.. ఏవీ బద్దలవుతాయో చూద్దాం.. నీ తాటాకుల చప్పుళ్లకు భయపడేవారు ఎవరు లేరు’’ అంటూ  టీడీపీ శాసనసభ పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రతిసవాల్ విసిరారు. హన్మకొండలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మీలాగా వంద ఎకరాల భూములు సంపాం దించుకోలేదు. కోటగుమ్మాలు కట్టుకోలేదు.. పవర్ ఫెన్సింగ్ చేసుకోలే దు..

ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను.. అక్కడే ఉంటాను.. తనతో పెట్టుకోవద్దు.. మంచికి మాత్రమే మంచివాన్ని.. అభివృద్ధికి సహకరిస్తాను.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పిచ్చిపిచ్చిగా సమాధానం చెపుతాను. ఇదే విధంగా వ్యవహరిస్తే పాలకుర్తిలో జరుగబోయే పరిణామాలకు దయాకర్‌రావుబాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని అన్నా రు. పాలకుర్తి నియోజకర్గానికి రూ.25 కోట్లు రాకుం డా కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించడంలో అర్థం లే దన్నారు. ఆ నిధు లు మంజూరైనపుడు తాను మంత్రిగా లేనన్నారు. నిధులు అడ్డుకున్నాననే సాకుతో పాలకుర్తి నియోజకవర్గానికి వెళ్లినపుడు గొడవలు సృష్టించాలని చూస్తున్నార ని కడియం విమర్శించారు. పాలకుర్తి ఓటర్లు దయాకర్‌రావు కంటే తనకు అధికంగా ఓట్లు వేశారు. పాలకుర్తి అభివృద్ధిలో వెనుకబడి ఉందని, అభివృద్ధిపై శ్రద్ధ చూపుతున్నానన్నారు.

 దయూకర్‌రావుగొడవ పడాలని చూస్తున్నాడు..
 ఈనెల 21వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలోని అరిపిరాలలో గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లానన్నారు. తనతో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావుతోపాటు పార్టీ నాయకులున్నారన్నారు. పోలీసులు మీరు ఒక్కరే రావాలని పార్టీ నాయకులను వెంట తీసుకురావద్దని చెబితే వారినందరిని తొర్రూరులు ఉండాలని చెప్పి హరిప్రియాలకు వెళ్లానన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు దాదాపు 450 మందితో ర్యాలీగా అరిపిరాలకు రాగా గ్రామం చివరలో పోలీసులు అడ్డుకొన్నారన్నారు. దయాకర్‌రావు ఒక్కరినే పంపించారన్నారు. బలగాన్ని వెంట పెట్టుకొని వచ్చి అరిపిరాలలో గొడవ చేయాలని చూశారన్నారు.

అక్కడ వీలుపడకపోవడంతో తొర్రూరులో మార్కెట్ కమిటీ గోదాం శంకుస్థాపన శిలాఫలకంపై తన పేరు కిందపెట్టారని వివాదం లేవదీశారని ఆరోపించారు. శిలాఫలకంపై ఏర్పాటు చేసిన పేర్ల అంశాన్ని పరిశీలించాలని, అవసరమయితే శిలాపలకాన్ని మార్చాలని అధికారులను అప్పుడే ఆదేశించినట్లు కడియం తెలిపారు. అయితే దయాకర్‌రావు ప్రతి సారి ఏదో సమస్యను సృష్టించి దానిని రాష్ట్ర స్థాయి సమస్యగా చిత్రీకరించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.

 ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యం
 కేసీఆర్ ఆశీర్వాదాలతో ఉప ముఖ్యమంత్రి కావడాన్ని దయాకర్‌రావు తట్టుకోలేక పోతున్నారన్నాడని విమర్శించారు. దయార్‌రావు ఈర్ష్యతో రగిలిపోతున్నాడు. ఆరోగ్యం పాడవుందని, దిక్కుతోచని స్థితిలో నిరాశ నిస్పృహలకు లోనై మంత్రిగాలే క పోయాననే బాధతో పిచ్చెక్కి మాట్లాడుతున్నారని తూర్పార బట్టారు.   ఎన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచామన్నది కాదు. ఏం నేర్చుకొన్నామన్నది ముఖ్యం. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే అయిన మీ నుంచి మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఆద ర్శంగా ఉండాల్సింది పోయి, మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారన్నారు.

 నా కుటుంబ సభ్యులు పోటీ చేయరూ..
 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులెవరు పోటీ చేయరని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు.  మందకృష్ణ మాదిగ పదే పదే.. కడియం శ్రీహరి టీఆర్‌ఎస్ టికెట్ తన కూతురుకు ఇిప్పిస్తారా? మాదిగలకు ఇప్పిస్తారా? అంటు ప్రశ్నిస్తున్నారన్నారు దీనికి కడియం శనివారం సమాధానం ఇచ్చారు ‘ తన కూతురు లేదా కుటుంబంలో మరెవ రు ఎన్నికల్లో పోటీ చేయరు. ఈ జిల్లా, తన కుటుంబానికి ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, జిల్లా ప్రజలు తనను నిండు మనస్సుతో ఆశీర్వదించారని, జిల్లా ప్రజలకు రుణపడి ఉన్నానన్నారు. జిల్లాలో మాదిగలు ఎక్కువగా ఉన్నారని, మాదిగలకు టీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వాలని చెపుతున్నానన్నారు.

తన వద్దకు మంద కృష్ణ వచ్చినపుడు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పానన్నారు. మంద కృష్ణను నమ్మె పరిస్థితులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు లేరన్నారు. దీంతో ఎమ్మార్పీఎస్ చీలికలు పేలికలయిందని విమర్శించారు. మాదిగలు మీ వెంట లేరన్నారు. 2014 ఎన్నికల్లో వర్థన్నపేటలో పోటీ చేస్తే 18 వేల ఓట్లు మీకొస్తే, 1.28 లక్షలు తనకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి మాదిగలు ఎవరి పక్క ఉన్నారో తేలిపోయిందన్నారు. వర్గీకరణకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ది మంద కృష్ణ వైఖరిలో మార్పు వచ్చిందన్నారు. స్వార్థం కోసం రోజుకో మాట, పూటకో మాటమాట్లాడితే ప్రజలు సహించరన్నారు.

గ్రామ జ్యోతి కార్యక్రమానికి నిధుల అవసరముందన్నారు. జీపీ నిధులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజక అభివృద్ధి నిధులను వినియోగించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ గ్దల పద్మ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు, బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement