అభివృద్ధికి బాసట
గ్రేటర్ ఫలితాలపై డిప్యూటీ సీఎం శ్రీహరి
సీఎం కేసీఆర్ను కలిసిన కడియం
హన్మకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగా గ్రేటర్ వరంగల్ ప్రజలు తీర్పు ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన ఓట ర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లకు కడియం శ్రీహరి అభినందనలు తెలిపారు. అందరం కలిసి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేద్దామన్నారు.
గోదావరి జలాలపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మకమైనదని కడియం శ్రీహరి అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం వల్ల ఉత్తర తెలంగాణకు ముఖ్యంగా వరంగల్ జిల్లాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని హైదరాబాద్కు వచ్చిన సీఎం కేసీఆర్ను కడియం శ్రీహరి బుధవారం కలిసి అభినందనలు తెలిపారు.