ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: దసరా, దీపావళి దృష్ట్యా రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్–కొచువెలి (07115/07116) రైలు అక్టోబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 9కి నాంపల్లిలో బయలుదేరి 2వ రోజు ఉదయం 3.20కి కొచువెలి చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్ 7, 14, 21, 28ల్లో ఉదయం 7.45కి కొచువెలిలో బయలుదేరి మరుసటి మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.
హైదరాబాద్–ఎర్నాకులం (071 17/07118) రైలు అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 12.50కి బయలుదేరి మరుసటి సాయంత్రం 5.30కి ఎర్నాకులం చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 9.30కి బయలుదేరి మరుసటి రాత్రి 10.55కి నాంపల్లి చేరుకుంటుంది. కాచి గూడ–శ్రీకాకుళం (07148/07147) రైలు అక్టోబర్ 6, 13, 20, 27, నవంబర్ 3, 10, 17, 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయం త్రం 6.45కి బయలుదేరి మరుసటి ఉదయం 8.55కి శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరిగి అక్టోబర్ 7, 14, 21, 28, నవంబర్ 4, 11, 18, 25, డిసెంబర్ 2, 9, 16, 23, 30ల్లో సాయంత్రం 5.15కి బయలుదేరి మరుసటి ఉదయం 6.30కి కాచిగూడ చేరుకుంటుంది.
కాకినాడ-కర్నూలు మధ్య 54 రైళ్లు
కాకినాడ టౌన్, కర్నూలు మధ్య అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు 54 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వారానికి రెండు రోజులు నడిపే ఈ రైళ్లు కాకినాడలో రాత్రి 6.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10కి కర్నూలు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో కర్నూలు నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30కి కాకినాడ చేరుకుంటుంది. ఈ రైళ్లలో ఏసీ త్రీటైర్, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
కాకినాడ-రాయచూర్ మధ్య 78 రైళ్లు
కాకినాడ-రాయచూర్ మధ్య అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 29 వరకు 78 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వారానికి మూడు రోజులు నడిపే ఈ రైళ్లు కాకినాడ టౌన్‌లో మధ్యాహ్నం 2.25కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కి రాయచూర్ చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో రాయచూర్ నుంచి మధ్యాహ్నం 2.05కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్‌కు చేరుకుంటాయి. ఈ రైళ్లలో ఏసీ త్రీటైర్, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment