
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు కొందరు, పారిపోయినవారు మరికొందరు, కిలాడీలు ఎత్తికెళ్తే వెళ్లేవారు ఇం కొందరు.. ఇలా రైళ్లలో దిక్కూ మొక్కూ లేకుండా సాగుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోం ది. మూడేళ్లలో దాదాపు 3 వేల మంది చిన్నారులను రైల్వే సిబ్బంది చేరదీశారు. వారి చిరునామాలు కనుక్కొని కొంతమందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చగా, అనాథలను రెస్క్యూహోమ్స్‌కు తరలించారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు.
చేరదీస్తున్న బాలసహాయతా కేంద్రాలు
ఇలాంటి చిన్నారులు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తుండటంతో వారిని చేరదీసేందుకు గతంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా బాల సహాయ తా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రా ల్లో ఆర్‌పీఎఫ్, గవర్నమెంట్, రైల్వే పోలీసు సిబ్బందితోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. రైళ్లపై దృష్టి పెట్టి అనుమానిత చిన్నారులను ప్రశ్నించి వారి సమస్యను గుర్తిం చి చేరదీయటమే వీరి పని. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ లాంటి ప్రధాన స్టేషన్లలో ఉన్న బాల సహాయతా కేంద్రాలు మంచి పని తీరుతో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్లలో 2,252 మంది బాలురు, 688 మంది బాలికలను రక్షించినట్టు తెలిపారు. అక్రమంగా రవాణా అవుతున్న 84 మంది చిన్నారులను రక్షించి, వారిని తరలిస్తున్నవారిపై కేసులు నమోదు చేశామన్నారు. వీరిని గుర్తించటంలో తమకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, దీనికోసం అన్ని రైల్వేస్టేషన్లలో వాటి ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment