Rescue homes
-
పాముల కోసం రెస్క్యూ సెంటర్
దుండిగల్: జీవ వైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతే ప్రధానంగా తోడ్పడుతుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా భౌరంపేట్‌లోని రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.1.40 కోట్లతో ఏర్పాటు చేసిన స్నేక్ రెస్క్యూ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా 35 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మరో నెల రోజుల్లో నిర్మల్‌లో కోతుల సంరక్షణ కేంద్రాన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. పాములను చూసి భయపడొద్దని, స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారమిస్తే వాటిని సురక్షితంగా ఈ కేంద్రానికి తరలిస్తారన్నారు. చెన్నైలోని గిండి స్నేక్ పార్క్‌కు దీటుగా భౌరంపేట్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 180 మంది స్నేక్ సొసైటీ సభ్యులు సహకారం అందిస్తున్నారని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఆర్.శోభ, మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, అటవీశాఖ అ«ధికారులు మునీంద్ర, చంద్రశేఖర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
మూడేళ్లు.. 2,940 మంది
సాక్షి, హైదరాబాద్: తప్పిపోయిన చిన్నారులు కొందరు, పారిపోయినవారు మరికొందరు, కిలాడీలు ఎత్తికెళ్తే వెళ్లేవారు ఇం కొందరు.. ఇలా రైళ్లలో దిక్కూ మొక్కూ లేకుండా సాగుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోం ది. మూడేళ్లలో దాదాపు 3 వేల మంది చిన్నారులను రైల్వే సిబ్బంది చేరదీశారు. వారి చిరునామాలు కనుక్కొని కొంతమందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చగా, అనాథలను రెస్క్యూహోమ్స్‌కు తరలించారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. చేరదీస్తున్న బాలసహాయతా కేంద్రాలు ఇలాంటి చిన్నారులు రైళ్లలో ఎక్కువగా కనిపిస్తుండటంతో వారిని చేరదీసేందుకు గతంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా బాల సహాయ తా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రా ల్లో ఆర్పీఎఫ్, గవర్నమెంట్, రైల్వే పోలీసు సిబ్బందితోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. రైళ్లపై దృష్టి పెట్టి అనుమానిత చిన్నారులను ప్రశ్నించి వారి సమస్యను గుర్తిం చి చేరదీయటమే వీరి పని. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ లాంటి ప్రధాన స్టేషన్లలో ఉన్న బాల సహాయతా కేంద్రాలు మంచి పని తీరుతో సత్ఫలితాలు సాధిస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్లలో 2,252 మంది బాలురు, 688 మంది బాలికలను రక్షించినట్టు తెలిపారు. అక్రమంగా రవాణా అవుతున్న 84 మంది చిన్నారులను రక్షించి, వారిని తరలిస్తున్నవారిపై కేసులు నమోదు చేశామన్నారు. వీరిని గుర్తించటంలో తమకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని, దీనికోసం అన్ని రైల్వేస్టేషన్లలో వాటి ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. -
ఆ పిల్లల్ని కలిసేందుకు అనుమతించొద్దు
సాక్షి, హైదరాబాద్ : వ్యభిచార కూపం నుంచి విముక్తి లభించి సంరక్షణ గృహాల్లో ఉన్న బాలికలను పెంపుడు తల్లులు కలుసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. యాదాద్రిలోని వ్యభిచార గృహాలపై దాడుల సందర్భంగా దొరికిన పిల్లలను రక్షిత గృహాల్లో ఉంచారు. ఆ బాలికలను కలిసేందుకు అనుమతించేలా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తప్పిపోయిన, కిడ్నాపైన పిల్లలను బలవంతంగా వ్యభిచార కూపాల్లోకి దించుతున్నారని పేర్కొంటూ పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణ చేపట్టింది. ఆ బాలికలను ప్రభుత్వ సంరక్షణ గృహాల్లో ఉంచింది. తమ పెంపుడు పిల్లలను కలుసుకునేందుకు వెళితే పోలీసులు అనుమతించడం లేదని, పిల్లలను కలుసుకునేందుకు అనుమతించాలని పలువురు పెంపుడు తల్లుల తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘అనుబంధ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కొందరిపై క్రిమినల్ కేసులున్నాయి. వారు కలిస్తే పిల్లలపై ప్రభావం ఉంటుంది. పిల్లల్ని కలుసుకునేందుకు రాచకొండ కమిషనర్ ఎవ్వరినీ అనుమతించరాదు’అని ఉత్తర్వులు జారీ చేసింది. -
రక్షిత గృహాలెన్ని? సామర్థ్యమెంత?
ఇరు ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణ కోసం ఏర్పాటైన రక్షిత గృహాలు (రెస్క్యూ హోమ్స్) ఎన్ని ఉన్నాయి. వాటిలో ఉన్న సౌకర్యాలు.. వాటి సామర్థ్యం తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ వివరాలను పరిశీలించిన తరువాత వసతి గృహాల పరిశీలన కోసం కమిటీలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణ కోసం రక్షిత గృహాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ ప్రజ్వల హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసింది.