వేధిస్తున్న వ్యక్తిపై చర్య తీసుకోవాలి
ఎస్పీని కలిసిన బాధితురాలు
నిజామాబాద్‌క్రైం : మరిది(భర్త తమ్ముడు) వేధింపుల నుంచి తనను, తన పిల్లలను కాపాడాలని ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన దేవుసరి రేఖ మంగళవారం ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వేడుకుంది. మరిది తనపై దౌర్జన్యం చేస్తున్నాడని, అత్యాచారం చేసి చంపాలని ప్ర యత్నించాడని, అతని వల్ల తన కు, తన పిల్లలకు ప్రాణభయం ఉందని చెప్పింది. అనంతరం బాధితురాలు తన ఇద్దరు పిల్లల తో కలిసి జిల్లా కేంద్రంలోని సాక్షి కార్యాలయానికి వచ్చి తన గోడు వెల్లబోసుకుంది. వివరాలు ఇలా ఉన్నా యి. రేఖ భర్త పోతన్న పదేళ్ల క్రితం విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. వీరికి ఒక బాబు(13), పాప(11) ఉన్నారు.
భర్త చనిపోయిన నాటి నుంచి భర్త తమ్ముడు విజయ్‌కుమార్ నిత్యం వేధిస్తున్నాడని తెలిపింది. ఈనెల 17న తనను వెంట్రుకలు పట్టుకుని ఈడ్చుకుని ఇంట్లోకి లాక్కెళ్లాడని, తాను ప్రతిఘటించడంతో ఆయన భార్య శోభ, ఆమె తల్లిదండ్రులు కలిసి తనను, పిల్లలను చంపేందుకు దాడి చేశారని విలపించింది. గల్లీవాసులు, కులస్తులు తమను కాపాడి తన మరిదిపై ఆర్మూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారని చెప్పింది. పుష్కరాలు పూర్తయ్యూక రమ్మని చెప్పడంతో ఈనెల 27న మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లానని, పోలీసులు విజయ్‌కుమార్ , అతని భార్య శోభను స్టేషన్‌కు తీసుకొచ్చి నామమాత్రపు విచారణ జరిపి పంపించి వేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది.
తన భర్త చనిపోయూక తమకున్న ఐదెకరాల పొలం అమ్మగా వచ్చిన రూ. 5 లక్షలు మరిది విజయ్ తన తల్లిని బెదిరించి దుబారా ఖర్చు చేశాడని తెలిపింది. అలాగే ఆలూరులోని పాత ఊరులో ఉన్న ఇల్లును అమ్మగా వచ్చిన డబ్బులు, తల్లి ఆరోగ్యం ఖర్చుల కొరకు దాచిన పెట్టిన డబ్బులు రూ. 18 వేలు సైతం వాడుకున్నాడని తెలిపింది. తన ఆత్తకు సంబంధించిన మూడు తులాల బంగారం, తన భర్త మృతితో వచ్చిన నష్టపరిహారం రూ. 50 వేలు కూడా అతడే వాడుకున్నాడని వివరించింది, ఈనెల 16న అత్త అనారోగ్యంతో చనిపోతే చావు ఖర్చులకు మరిది ఒక్కపైసా ఇవ్వలేదని, తన వద్ద ఉన్న రూ. ఆరువేలు అంత్యక్రియల ఖర్చులకు ఇచ్చానని చెప్పింది.
మరుసటి రోజు తనను, తన పిల్లలను చంపి తన ఇంటిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేశాడని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. రేఖ ఫిర్యాదు పట్ల సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే ఆర్మూర్ పోలీసులకు విషయాన్ని తెలిపి బాధితురాలికి అండగా ఉంటడాలని ఆదేశించారు.