ప్రతీకాత్మక చిత్రం
డిచ్‌పల్లి/మోర్తాడ్: గ్రామ పంచాయతీల పాలకవర్గం పదవీ కాలం ఆగస్ట్ ఒకటో తేదీతో ముగియనుంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆగస్టు 2 నుంచి ప్రతి క్లస్టర్‌కు ఇన్‌చార్జిగా గెజిటెడ్ ఆఫీసర్‌ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్పంచు ల పదవీకాలాన్ని పొడించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రభుత్వానికి విన్నవించినా, ప్రత్యేక పాలన వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
నూ తన పంచాయతీరాజ్ చట్టం–2018 సెక్షన్ 136 ప్రకారం ప్రత్యేకాధికారుల నియామకానికి చర్య లు తీసుకోంటోంది. మండల స్థాయిలో గెజిటెడ్ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి ఒక్కో క్లస్టర్ ఇన్‌చార్జి బా ధ్యతలు అప్పగించనున్నారు. సర్పంచ్‌ల స్థానం లో స్పెషల్ ఆఫీసర్లు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేకాధికారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు.
జిల్లాలో కొత్తగా ఏర్పడిన పంచాయతీలను కలుపుకుని మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. పంచాయతీ కార్యదర్శుల కొరత వల్ల గతంలోనే పాలనా సౌలభ్యం కోసం పంచాతీయలను క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో మూడు, నాలుగు జీపీలు ఉన్నాయి. క్లస్టర్ పంచాయతీ కార్యదర్శి ఆ క్లస్టర్ పరిధిలోని జీపీల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం క్లస్టర్‌ల వారీగానే పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమంచనున్నారు.
గెజిటెడ్ ఆఫీసర్లే ప్రత్యేకాధికారులు..
జుమండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఎం పీడీవో, ఈవోపీఆర్డీ, ఎంఈవో, వెటర్నరీ డాక్టర్, మండల వ్యవసాయాధికారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏ ఈ, పీఆర్ ఏఈలను గ్రామపంచాయతీ క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. ఒక్కో మండలంలో క్లస్టర్లు ఎక్కువ ఉండి అధికారులు త క్కువగా ఉంటే ఒక్కో అధికారికి రెండుకు పైగా క్లస్టర్ల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, క్లస్టర్ల సంఖ్యను బట్టి అవసరమైతే ఇతర శాఖల అధికారులను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించే అవకాశముంది.
సర్పంచ్ స్థానంలో స్పెషల్ ఆఫీసర్..
ప్రస్తుతం గ్రామ పంచాయతీ అభివృద్ధి నిధులకు సంబంధించి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఉంది. స్పెషల్ ఆఫీసర్ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్పంచ్ స్థానంలో ప్రత్యేక అధికారి సంతకంతో పాటు చెక్‌లపై కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో జాయింట్ చెక్ పవర్ ఉన్నప్పటికీ గ్రామాల్లో సర్పంచులు చెప్పిందే వేదంగా నడిచేది.
సర్పంచులు ఇష్టారీతిన బిల్లులు రాసుకున్నా పంచాయతీ కార్యదర్శులు విధి లేక సంతకాలు చేసే వారు. సర్పంచులతో పాటు కొందరు కార్యదర్శులు దీనిని తమకు అనుకూలంగా మార్చుకు నే వారు. అయితే, ఇకపై గెజిటెడ్ ఆఫీసర్స్ ఇన్‌చార్జీలుగా రావడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment