సూపరింటెండెంట్‌తో వాగ్వాదం చేస్తున్న స్టాఫ్ నర్సులు
ఎంజీఎం : వైద్య, ఆరోగ్యశాఖలో కొనసాగుతున్న స్టాప్ నర్సుల బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు స్టాఫ్ నర్సులు ఆందోళన చేపట్టారు. ఈమేరకు శుక్రవారం ఉదయం విధులు బహిష్కరించి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు.. సిటీ స్కాన్, ఐసీయూ ఆపరేషన్ థియేటర్ వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ పొందినుట్ల సర్టిఫికెట్లు తీసుకుని వచ్చి బదిలీలు కాకుండా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా బదిలీల్లో ఇటువంటి సర్టిఫికెట్లకు విలువ లేదని, పీడియాట్రిక్ విభాగంలో 15 రోజుల శిక్షణ ఆశావర్కర్లకు కూడా ఉంటుందని తెలిపారు. ఈ కోర్సులు ఎలాంటి స్పెషలైజేషన్, డిప్లొమా కోర్సుల కిందకు రావని పేర్కొన్నారు.
అంతే కాకుండా స్టాఫ్ నర్సులకు రోటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయకపోవడంతోనే చాలా మంది సీటీ ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, పిడియాట్రిక్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆన్‌మ్యారీడ్ నర్సింగ్ హాస్టల్‌లో ఓ హెడ్‌నర్సు ఉంటూ హెచ్‌ఆర్‌ఓఏ తీసుకుంటోందని, ఆరోగ్యశ్రీ డబ్బుల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షురాలు జ్ఞానసుందరి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, హెడనర్సులు స్వరూపారాణి, రోజ్‌లీనా, స్టాఫ్ నర్సులు సుధామణి, తిరుమల, నర్సమ్మ, ప్రేమలత, సరిత, నాగమణి, జయశీల, ప్రమీల, సుధారాణి, చిన్ని, కళావతి, విమలమ్మ,పావని, సరోజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment