దాడులకు దిగితే పని చేయలేం.. | Strikes down and can not work | Sakshi
Sakshi News home page

దాడులకు దిగితే పని చేయలేం..

Published Sat, Nov 29 2014 3:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దాడులకు దిగితే పని చేయలేం.. - Sakshi

దాడులకు దిగితే పని చేయలేం..

వరంగల్ అర్బన్ : అర్హులందరికీ పింఛన్లు మం జూరు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు బల్దియా కార్యాలయంలోకి వెళ్లేందుకు య త్నించగా.. పోలీసులు గేట్లు వేసి నిలువరించారు. దీంతో కొందరు నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించగా.. మరికొందరు గేట్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. చివరకు కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులకు పోలీసులు అనుమతి ఇచ్చినా కమిషనర్ బయటకు రావాలని నేతలు కోరా రు. దీనికి నిరాకరించిన కమిషనర్ నాయకులనే తన చాంబర్‌లోకి రావాలని సూచించారు. దీనికి ససేమిరా అన్న కాంగ్రెస్ నాయకులు బ ల్దియా ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించిన పోలీసులు మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఛీఫ్ విప్ గండ్ర వెంకట రమాణారెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షులు నాయిని రా జేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్ తదితరుల ను మట్టెవాడ పోలీసుస్టేషన్‌కు తరలించి.. ఆ పై సొంత పూచీకత్తుతో విడుదల చేశారు.

 సీఎం మెడలు వంచి పింఛన్లు  ఇప్పిస్తాం : మాజీ మంత్రి సారయ్య

అర్హులందరికీ పింఛన్లు ఇచ్చే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. బల్దియా వద్ద ఆందోళనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మెడలు వంచైనా పింఛన్లు ఇప్పిస్తామన్నారు. అనంత రం మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదని విమర్శించారు. పింఛన్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో పేదలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలోని లోపాలను సవరించి అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాస్‌తో పాటు నాయకులు పుల్లా భాస్కర్, పోలా నటరాజ్, మహమూద్, తత్తరి లక్ష్మణ్, రోకుల భాస్కర్, దామెర సర్వేష్, రమణారెడ్డి, కిషన్, మేకల బాబూరావు, దూపం సంపత్, బాసాని శ్రీనివాస్, నాయకులు గౌసుద్దీన్, గోరంటల రాజు, రమణారెడ్డి, గోరంటల రాజు తదితరులు పాల్గొన్నారు.
 
హన్మకొండ అర్బన్ : తెలంగాణ రాష్ర్ట సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని.. అలాంటి వారిపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సు బ్బారావు తెలిపారు. చేర్యాల మండలం మర్రి ముస్త్యాల గ్రామపంచాయతీ కార్యదర్శి రాంబాబుపై తలారి యాద య్య దాడి చేయడాన్ని నిరసిస్తూ పీఆర్ ఉద్యోగులు కలెక్టరే ట్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు టీఎన్జీ వో సంఘం మద్దతు ప్రకటించింది. కార్యక్రమానికి హాజరైన సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగులు అన్ని వర్గాల వారితో మమేకమై రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగులపై దా డులు జరగకుండా పోలీసు యంత్రాంగానికి కలెక్టర్ తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దాడికి గురైన రాంబాబు మా ట్లాడుతూ ఆసరా పింఛన్ల జాబితాలో తమ వారి పేర్లు లేవ ని రాత్రి ఫోన్‌లో దుర్భాషలాడారని, ఉదయం విధుల్లోకి రా గానే యాదయ్య తనపై దాడి చేశారన్నారు. టీఎన్జీవోస్ ఎం పీడీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పంచాయ తీ కార్యదర్శుల సంఘం కన్వీనర్ రామారావు, టీఎన్జీవోస్ కార్యదర్శి రత్నవీరాచారి, టీజీఓల సంఘం కార్యదర్శి జగన్మోహన్‌రావు, ట్రెస్సా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, కార్యదర్శి రాజ్‌కుమార్, టీఎన్జీవోస్ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, నాయకులు రాజేష్, విజయలక్ష్మి, రాంకిషన్, రాజే ష్, శ్రీనివాస్, బుస్సా శ్రీనివాస్‌తో పాటు గుర్రంపేట పం చాయతీ కార్యదర్శి ఉస్మాన్, జీపీ కార్యదర్శుల సంఘం కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కిషన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
 
చేర్యాల మండలం మర్రి ముస్త్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంబాబుపై తలారి యాదయ్య దాడి చేయడాన్ని నిరసిస్తూ పీఆర్ ఉద్యోగులు కలెక్టరేట్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు.  ఉద్యోగులపై దాడులకు దిగితే... పని చేయలేమని ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు.
 
 - హన్మకొండ అర్బన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement