విద్యార్థి సంఘాల ఆందోళన | Student unions concerned | Sakshi
Sakshi News home page

విద్యార్థి సంఘాల ఆందోళన

Published Sun, Jun 28 2015 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

Student unions concerned

ఉద్రిక్తంగా మారిన విద్యార్థి సంఘాల ఆందోళన
 కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నం
 వారి వెంట పరుగులు తీసిన పోలీసులు
 దాదాపు గంటసేపు హైడ్రామా : భారీగా తోపులాట
 50 మంది విద్యార్థి నాయకుల
 అరెస్ట్ : ఠాణాకు తరలింపు
 
 ఇందూరు : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీతో  శాంతియుతంగా వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని నిలువరించడానికి పోలీసులు యత్నించినప్పటికీ, విద్యార్థి నాయకులు దాదాపు పది మంది వరకు గేట్లను తోసుకుని మరీ లోనికి పరుగులు తీశారు. పోలీసులు వారి వెంట పరుగులు తీశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న నాయకులను, లోనికి చొరబడినవారిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు.
 
 అయితే, విద్యార్థి నాయకుల ఆరెస్టుకు నిరసనగా మరికొంత మంది విద్యార్థి నాయకులు ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోదఫా విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు విద్యార్థి నాయకులు మరోసారి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లడానికి గేటు ఎక్కడానికి ప్రయత్నం చే యగా పోలీసులు అడ్డుకున్నారు. భారీ తోపులాట అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను లాక్కె ళ్లి పోలీసు వ్యాన్‌లో ఎక్కించి, ఒకటో టౌన్‌కు తరలించారు. మొత్తం మీద గంట సేపు విద్యార్థి నాయకులు హంగామా చేశారు. దాదాపు 50 మంది వి ద్యార్థి నాయకులు అరెస్టు అయ్యారు.
 
 విద్యార్థులను ప్రభుత్వం వంచిస్తోంది
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యార్థుల సమస్యలు తీరుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ హామీలను మరిచి విద్యార్థులను వంచిస్తున్నారని పీడీఎస్‌యూ జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. విద్యార్థుల పేరుతో గెలిచిన కేసీఆర్ విద్యరంగ సమస్యల పరిష్కరించకుండా వెన్నుచూపడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎంపీ కవిత ఎంపిక కావడం ఇందుకు అ ద్దం పడుతోందన్నారు. కేజీ టూ పీజీ విద్యను అమలు చేస్తానని చెప్పి, సంవత్సర కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం దారుణమన్నారు. వెంట నే దాని విధి విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 
  ప్రభుత్వ విద్యా వ్యవస్థకు భంగం కలిగిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలన్నారు. ప్రయివేటు వి ద్యా సంస్థల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యహరిస్తోందన్నారు.వెంటనే ఫీజుల నియంత్రణ చట్టా న్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించి, ప్ర భుత్వ, ప్రయివేటు పాఠశాలలలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగించాలన్నారు. ఈ ఆందోళనలో పీడీఎస్‌యూ సంఘ నాయకులు అన్వేష్, సౌంద ర్య, సుధాకర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శు లు కిరణ్, భానుప్రసాద్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు నరేష్, రఘురాం, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, వినయ్ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement